తెలంగాణ

హీరా గోల్డ్ నౌహీరా షేక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ అధికారులు

Heera Gold Nowheera Sheikh: హీరా గోల్డ్ నౌహీరా షేక్‌ కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. ఆమెకు సంబంధించిన ఆస్తులను వేలం వేశారు అధికారులు. ఆస్తుల వేలం ద్వారా వచ్చిన రూ.19 కోట్ల పై చిలుకు నగదుని బాధితులకు ఇవ్వనున్నారు. అటాచ్ చేసిన ఆస్తులను అమ్మకానికి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 5వేల900 కోట్లు వసూలు చేసి నౌహీరా షేక్ బిచాన ఎత్తివేశారు. ఆమెపై దేశవ్యాప్తంగా 52కు పైగా కేసులు నమోదు చేశారు.

ఈడీ వేలంలో నౌహీరా షేక్ ఆస్తి 19.64 కోట్లను వేలంపాట ద్వారా వచ్చే మొత్తాన్ని మోసపోయిన బాధితులకు పెట్టుబడిదారులకు తిరిగి వినియోగించనున్నారు. నవంబరు 21, 2025న ఆ ఆస్తి రిజిస్ట్రేషన్‌ను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తి చేశారు. ఈ ఆస్తిని ఈడీ 16.08.2019న తాత్కాలిక అటాచ్‌మెంట్ ఆర్డర్ ద్వారా స్వాధీనం చేసుకుంది. నౌహీరా షేక్ రూ.5,978 కోట్ల మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button