తెలంగాణ
హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సీజ్

హైదరాబాద్ లంగర్ హౌస్‌లోని ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఫైర్ మరియు ట్రాఫిక్, జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా స్కూల్‌ను నడిపిస్తున్నారని విద్యాశాఖ అధికారులు స్కూల్‌ను సీజ్ చేశారు. ప్రస్తుతం స్కూల్లో నర్సరీ నుండి 8వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 800 వరకు విద్యార్థులు ప్రస్తుతం ఈ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
రెండు నెలల క్రితమే విద్యాశాఖ అధికారులు స్కూలుకు నోటీసులు ఇచ్చారు. అయినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి సీజ్ కు ఆదేశించారు. ఈ మేరకు స్కూల్ ను సీజ్ చేశారు.



