ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు ఫ్లోర్లలో సీఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. సీఆర్డీఏ సహా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ‘ఎ’ అక్షరం ఎలివేషన్‌తో తీర్చిదిద్దారు. సీర్డీఏ మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు.



