తెలంగాణ
హైదరాబాద్ మీర్‌పేట మాధవి హత్య కేసులో ట్విస్ట్

హైదరాబాద్ మీర్‌పేట మాధవి హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గురుమూర్తికి మరదలితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఆ విషయంలో భార్య మాధవితో గురుమూర్తికి చాలాసార్లు గొడవలయ్యాయి. పలుమార్లు పంచాయితీ చేసినా గురుమూర్తి మారలేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో భార్యను చంపాడు గురుమూర్తి.
మాధవిని ముక్కలుగా నరికి, కుక్కర్‌లో ఉడికించి ఎముకలు పొడి చేసి చెరువులో పడేశాడు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్, డీఎన్ఏ మ్యాచింగ్ శాంపిల్స్‌తో సైంటిఫిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. మరదలితో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్దారణ అయ్యింది.



