News
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ మనవడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు. తన తాతయ్య సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, చేతులు జోడించి కన్నీటి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎన్టీఆర్ అమరహే అంటూ వారు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.



