ఆంధ్ర ప్రదేశ్
ఎన్టీఆర్ 30వ వర్ధంతి- ప్రముఖుల నివాళులు

దివంగత నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన సమాధి వద్ద నందమూరి కల్యాణ్‌రామ్, బాలకృష్ణ, పురందేశ్వరి, బాబూ మోహన్, మంత్రి నారా లోకేశ్, భువనేశ్వరి పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఘాట్‌ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ట్రస్ట్ నిర్వాహకులు పరిసరాల్లో ఎన్టీఆర్ రాజకీయ, సినీ విశేషాలు తెలిపే చిత్రాలను ప్రదర్శించారు.



