ఆంధ్ర ప్రదేశ్
Kesineni Chinni: మద్యం కేసులో త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నారు

Kesineni Chinni: కల్తీ మద్యంపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. మద్యం కేసులో త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నాడని అన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లి రాష్ట్ర ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకు డ్రామా ఆడుతున్నారని ఎంపీ కేశినేని చిన్ని మండిపడుతున్నారు.
నకిలీ మద్యం తయారీలో ప్రధాన సూత్రధారుడైన జనార్ధన్ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో గంటల సేపు చర్చలు జరిపిన సిసి ఫుటేజ్ వీడియో అధికారులు త్వరలో బయట పెడతారని ఆయన అన్నారు.



