తెలంగాణ
Bandi Sanjay: సర్కారీ ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం

Bandi Sanjay: ప్రభుత్వ ఆసుపత్రులుకు వచ్చే పేద రోగులను టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపొదని కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి జమ్మికుంట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని బండి సంజయ్. దాదాపు కోటి రూపాయల అత్యాధునిక వైద్య పరికరాలను సీఎస్సార్ నిధుల ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ ఆస్పత్రికి అందించారు.
ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, మల్టిపురా మానిటర్, ఆటోక్లేవ్(లార్జ్), డయా థెర్మా మిషన్, అనెస్థిషియా వర్క్ స్టేషన్, ఈఎన్టీ హెడ్ లైట్, ఫెటల్ మానిటర్ సహా మొత్తం 15 వైద్య పరికరాలను అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదే పేదలని.. వారికి రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చికిత్స అందించేలా వైద్యులు చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు బండి సంజయ్.



