Peddi: పెద్ది బాధ్యతలు తీసుకున్న విక్కీ కౌశల్ తండ్రి?

Peddi: ప్రస్తుతం పెద్ది షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్ చరణ్, శివరాజ్ కుమార్ కాంబోలో భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జోరుగా సాగుతోంది. దీనిని విక్కీ కౌశల్ తండ్రి అయిన షామ్ కౌశల్ రూపొందిస్తున్నారు.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశంలో రామ్ చరణ్‌తో పాటు శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ ప్రముఖ స్టంట్ డైరెక్టర్ షామ్ కౌశల్ ఈ యాక్షన్ భాగాన్ని రూపొందిస్తున్నారు.
దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి స్టంట్స్ అందించిన షామ్ కౌశల్ ఈ చిత్రంలోని కీలక ఫైట్‌ను రూపొందిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పైగా ఆయన నటుడు విక్కీ కౌశల్ తండ్రి కావడం ఈ వార్తకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రంలో మలుపు తిరుగుతుందని తెలుస్తోంది.



