తెలంగాణ
Revanth Reddy: ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రైజింగ్ సదస్సుకు ప్రధాని మోడీ, ఖర్గే, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానాలు అందిస్తారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
4 వేల మందికిపైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.



