తెలంగాణ
హైదరాబాద్‌లో దారుణం.. కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్ బాలానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పద్మారావు నగర్ ఫేజ్ వన్‌లో సాయిలక్ష్మి, అనిల్ దంపతులు ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిని చంపి.. బిల్డింగ్ పైనుంచి దూకి సాయిలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



