తెలంగాణ
Seethakka: యూరియాపై బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోంది

Seethakka: పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల వల్లే యూరియా సరఫరా కొరత ఉందని మంత్రి సీతక్క అన్నారు. రైతులతో రాజకీయం చేస్తూ బీఆర్‌ఎస్ లబ్ది పొందాలని చూస్తోందని మంత్రి విమర్శించారు. ములుగు జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గోవిందరావుపేట, ములుగు తదితర మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీతక్క ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.



