మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

Maoists: వరుస ఎన్కౌంటర్లతో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాత పోలీసుల ఎదుట లొంగిపోయింది.. మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసిన ఆమెపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో కోటికిపైగా రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, సుజాత బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జ్గా ఉన్నారు. సుక్మా ప్రాంతంలో జరిగిన అనేక ఘటనల్లో ఆమె మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. చికిత్స నిమిత్తం కొత్తగూడెంలోని దవాఖానకు వెళ్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బెంగాల్లో హత్యకు గురైన నక్సలైట్ కమాండ్ కిషన్‌జీ భార్య అని అధికారులు తెలిపారు.
మహబూబ్ నగర్‌కు చెందిన కల్పన అలియాస్ సుజాతను పోలీసులు విచారిస్తున్నారు. మావోయిస్టులకు సంబం ధించిన కీలక సమాచా రాన్ని ఆమె నుండి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో సుజాత పని చేశారు. కాగా ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుజాత అరెస్ట్ తో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది.



