ఆంధ్ర ప్రదేశ్
Perni Nani: బీజేపీ,టీడీపీ చేసిన పాపాలను మర్చిపోయారా?

Perni Nani: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి హిందూమతం ముసుగులో వైసీపీపై విషం చిమ్ముతున్నారని మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు ఆఫీస్ నుంచి టైప్ చేసి పంపించినట్లు ఇద్దరూ ఒకే పోస్ట్ పెట్టారని అన్నారు. బీజేపీని కూడా టీడీపీలో కలిపేయాలంటూ చురకలంటించారు.
బీజేపీ, టీడీపీ చేసిన పాపాలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయంలో తిరుమలలో వేయి కాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన సంఘటన మర్చి పోయారా..?అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై ఎక్కువగా దాడులు జరిగాయని ఆరోపించారు.



