నేడు ఖమ్మంలో కేటీఆర్ పర్యటన

ఖమ్మం జిల్లాలో నేడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లాలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను సన్మానించే కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ పర్యటనకు ముందే బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. నగరంలోని ప్రధాన సెంటర్లలో కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాపర్తి నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు సుమారు వెయ్యి బైక్‌లతో ర్యాలీ నిర్వహించి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను కేటీఆర్ సన్మానించనున్నారు. సన్మాన కార్యక్రమం తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీకి జిల్లాలో గట్టి షాక్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ పర్యటనతో కేడర్‌కు మరింత జోష్ వస్తుందని జిల్లా నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



