తెలంగాణ
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత

ఓయూలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నెల 21 న సీఎం రాకను బీఆర్ఎస్వీ నాయకులు ఖండించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. విద్యార్థులను ఓయూ పీఎస్ కు తరలించారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లలాగా పనిచేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.



