Mukul Dev: తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం.. నటుడు ముకుల్ దేవ్ ఇకలేరు

Mukul Dev: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ అనారోగ్యంతో కన్నుమూశారు. 54 ఏళ్ల వయస్సులో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు సినిమా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. బహుముఖ నటుడు, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన ముకుల్ దేవ్ శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ 54 ఏళ్ల వయస్సులో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితురాలు, నటి దీప్‌శిఖా నాగ్‌పాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ముకుల్ 1996లో బాలీవుడ్‌లో “దస్తక్” సినిమాతో కెరీర్ ప్రారంభించారు. తెలుగులో “కృష్ణ”, “ఏక్ నిరంజన్”, “అదుర్స్”, “బెజవాడ” వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. హిందీలో “సన్ ఆఫ్ సర్దార్”, “జై హో” సినిమాలతో పాటు బెంగాలీ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. ఆయన చివరి చిత్రం “అంత్ ది ఎండ్”. ముకుల్ సోదరుడు, నటుడు రాహుల్ దేవ్ కూడా బాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందారు. ముకుల్ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది.