సినిమా
Mahavatar Narsimha: యూఎస్‌లో ‘మహావతార్ నరసింహ’ హవా!

Mahavatar Narsimha: యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ యూఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. లిమిటెడ్ స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా అనూహ్య వసూళ్లతో రికార్డులు బద్దలు కొడుతోంది.
‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. భారత్‌లో విడుదలై సక్సెస్‌ఫుల్ రన్ సాధించిన ఈ చిత్రం, యూఎస్ మార్కెట్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది. లిమిటెడ్ స్క్రీన్స్‌లో రిలీజైనప్పటికీ, తక్కువ సమయంలోనే 1.1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది.
250 కోట్ల దిశగా దూసుకెళ్తున్న ఈ చిత్రం, డివోషనల్ జానర్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వం, సామ్ సి ఎస్ సంగీతంతో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది.



