ఆంధ్ర ప్రదేశ్
Dharmavaram: వడ్డీ చెల్లించలేదని చేనేత కుటుంబంపై దాడి చీరల వ్యాపారి

Dharmavaram: అనంతపురం ధర్మవరంలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తిరిగి చెల్లించలేదని దంపతులపై వడ్డీ వ్యాపారులు దాడికి పాల్పడ్డారు. పిల్లలు అరుపులు పెడుతున్నా వదలకుండా కాళ్లతో తన్నుతూ అత్యంత దారుణంగా దాడి చేశారు. ఇంట్లోకి దూరి కుటుంబసభ్యులపై దాడులు చేశారు వ్యాపారస్తులు. వారానికి పది రూపాయలు వడ్డీ వసూళ్లు చేస్తున్నాయి కాల్ మనీ గ్యాంగ్‌లు.
అయితే గత రాత్రి శాంతి నగర్లో చీరల వ్యాపారి రమణ అనే వ్యక్తి ఇంట్లోకి దూరి దాడికి పాల్పడ్డారు. పిల్లలు అరుపులు పెడుతున్నా వదలకుండా కాళ్లతో తంతూ కర్కశంగా దాడికి ఎగబడ్డారు. రాజా అనే వడ్డీ వ్యాపారి వద్ద 6లక్షలకు పూచి పడ్డారు రమణ. ఇప్పటికే 15లక్షలకు పైగా వడ్డీ చెల్లించారు. అయినా ఇంకా డబ్బు చెల్లించలేదని దాడి చేశారు.



