సినిమా

మెగా158కు రెహమాన్ మ్యూజిక్?

Mega158: రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమాకు కూడా రెహమాన్ మ్యూజిక్ ఖరారైందని బజ్ బలంగా వినిపిస్తోంది. బాబీ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రెహమాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ జోరుగా సాగుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రానికి సంగీతం అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో రెహమాన్ మరో మెగా ఫ్యామిలీ ప్రాజెక్ట్‌కు సంగీత బాధ్యతలు చేపట్టనున్నట్లు టాక్ జోరుగా వినిపిస్తోంది. అది మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం. కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో, కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది.

ఈ చిత్రాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా రెహమాన్‌కు సంగీత బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. ఆయన కూడా ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారనే బజ్ బలంగా వినిపిస్తుంది. దీంతో రెహమాన్, వరుసగా రెండు మెగా ప్రాజెక్ట్స్ చేయనున్నాడు. ఈ సంగీత దిగ్గజం ఎంపికతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button