తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో

Telangana: హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి రానుంది. ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ అండ్ టీ గ్రూప్ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్ మధ్య జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం ఖరారైంది.

ఈ ఒప్పందంతో దేశంలో ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న ఏకైక మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో రైలు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న 13 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది.

ఎల్ అండ్ టీకి ఈక్విటీ వాటాగా 2 వేల కోట్లు వన్-టైమ్ సెటిల్‌మెంట్‌గా చెల్లించేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం పూర్తయితే, మొదటి దశలోని 72 కిలోమీటర్ల మూడు కారిడార్లు పూర్తిగా ప్రభుత్వం నిర్వహణలోకి వస్తాయి. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణం వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మెట్రో బాధ్యతలు ప్రభుత్వం చేపట్టడంపై నగర ప్రజలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం పరుస్తున్నారు. మెట్రో రైలు నిర్వహణలో వచ్చిన మార్పులపై రాజ్‌న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button