ఆంధ్ర ప్రదేశ్
AP: నీట మునిగిన సంజీవ్ నగర్

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని సంజీవ్ నగర్ కాలనీ నీటమునిగింది. వర్షం నీరు అలాగే ఉండటంతో కాలనీ వాసులు ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. అధికారులు స్పందించి కాలనీలోని నీరు బయటకు పంపే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీలో నీరు చేరడంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.



