ప్రభాస్ 'స్పిరిట్'లో మెగాస్టార్!

Spirit: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమా ‘స్పిరిట్’ సంచలనంగా రూపొందుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవర్ఫుల్ కాప్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్క్రిప్ట్ పూర్తయిన ఈ సినిమాకి ప్రస్తుతం కీలక నటీనటుల ఎంపిక జోరందుకుంది.
స్పిరిట్ లో ఆసక్తికరంగా కొరియన్, అమెరికన్ యాక్టర్స్‌తో పాటు ఇతర భాషల స్టార్లను కూడా తీసుకునే యోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ క్రమంలో మలయాళ మెగాస్టార్ మమ్మూట్టిని ఓ ముఖ్య పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్‌తో సందీప్ రెడ్డి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ, ‘ప్రభాస్ సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్‌ను ‘స్పిరిట్’లోనూ కొనసాగిస్తాం’ అని చెప్పారు.
టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కథాంశం సరికొత్తగా, వినూత్నంగా ఉంటుందని టాక్. సందీప్ రెడ్డి మరోసారి తనదైన మార్క్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘స్పిరిట్’ పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.