తెలంగాణ
Leopard: బోనులో చిక్కింది.. ఇక్రిశాట్లో చిరుత కలకలం

హైదరాబాద్ ఇక్రిశాట్లో చిరుత కలకలం రేగింది. అయితే అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనుకు చిరుత చిక్కింది. దీంతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, సిబ్బంది, కూలీలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు, మూడు రోజులుగా ఇక్రిశాట్ పరిశోధన క్షేత్రాల్లో చిరుత సంచారించింది. గమనించిన సిబ్బంది అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇక్రిశాట్ అధి కారుల ఫిర్యాదుతో అటవీశాఖ సీసీ కెమెరాలు, బోను ఏర్పాటు చేసింది. బోనులో రెండు మేకలను కూడా ఉంచారు. ఇక వాటిని వేటడానికి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో పడింది. బోనులో చిక్కిన చిరుతను కాసేపట్లో హైదరాబాద్ జూ పార్కుకు తరలించనున్నారు. అయితే గతంలో రెండు సార్లు ఇదే చోట చిరుతలు పట్టుబడినట్లు తెలుస్తుంది.