జాతియం

Mehul Choksi: వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు

Mehul Choksi: ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్ అయ్యాడు. బెల్జియం పోలీసులు మెహుల్ ఛోక్సీని అదుపులోకి తీసుకున్నారు. మెహుల్ ఛోక్సీని అప్పగించాలని భారత్ అభ్యర్థించిన ట్లు సమాచారం. దీంతో సీబీఐ విజ్ఞప్తి మేరకు బెల్జియం పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 13వేల 500కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డారని మెహుల్ ఛోక్సీపై అభియోగాలు ఉన్నాయి. బ్యాంకులో మోసం చేసి విదేశాలకు పారిపోయినట్లు అధికారులు కూడా ధృవీకరించారు.

అంతేకాదు అతడిని భారత్‌కు రప్పిం చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి కూడా. ఈ క్రమంలో అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో సీబీఐ అభ్యర్థన మేరకు మెహుల్ ఛోక్సీని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button