Prabhas: ఫౌజీ డైరెక్టర్ తో ప్రభాస్ మరో సినిమా

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ మోడ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన మారుతితో ‘ది రాజా సాబ్’ సినిమా చేస్తూనే, హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ అనే భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఓ పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుండగా, ఇప్పటికే సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది.
అయితే, ‘ఫౌజీ’ సినిమాను హను రాఘవపూడి హ్యాండిల్ చేస్తున్న స్టైల్‌కి ప్రభాస్ ఫిదా అయిపోయాడట. ఈ క్రమంలోనే ఈ సినిమా పూర్తి కాకముందే, హనుతో మరో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ హీరో-డైరెక్టర్ కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు.
ఇక ‘ఫౌజీ’లో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా, ప్రభాస్-హను కాంబినేషన్ రెండు బిగ్ బడ్జెట్ చిత్రాలతో అభిమానులకు పండగ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.