Rana Daggubati: 'మిరాయ్' లో రానా దగ్గుబాటి

Rana Daggubati: తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాతో ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తేజ క్రేజ్ రెట్టింపు అయిపోయింది. ఇప్పుడు ఆయన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సూపర్ హీరో జోనర్‌లో రూపొందుతోంది.
ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, లేటెస్ట్ బజ్ ఏంటంటే రానా దగ్గుబాటి కూడా ‘మిరాయ్’లో ఓ కీలక పాత్రలో జాయిన్ అయ్యాడట. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రోల్ కోసం మొదట దుల్కర్ సల్మాన్‌ను అనుకున్నారట మేకర్స్. కానీ, దుల్కర్ బిజీ షెడ్యూల్ వల్ల ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు.
దీంతో రానా దగ్గుబాటిని రంగంలోకి దింపారని ఇండస్ట్రీ టాక్.‘మిరాయ్’తో తేజ సజ్జా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని అభిమానులు ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. ఈ సినిమా తేజ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. మరి, ఈ సూపర్ హీరో మూవీ ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.