ఆంధ్ర ప్రదేశ్
Tirumala: పాపవినాశనం డ్యామ్‌లో బోటింగ్ వివాదంపై అటవీశాఖ వివరణ

Tirumala: పాపవినాశనం డ్యామ్‌లో బోటింగ్ వివాదంపై అటవీశాఖ వివరణ ఇచ్చింది. తిరుమలలో బోటింగ్ కోసం ట్రయల్ రన్ అంటూ ప్రచారం జరిగింది. పాపవినాశనం డ్యామ్ చుట్టూ పడవలతో తనిఖీలు జరిగాయని అధికారి వివేక్ స్పష్టతనిచ్చారు.
శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం బయోస్ఫేర్ రిజర్వ్ లోని పాపవినాశనం డ్యామ్ పరిసరాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో తనిఖీ చేయడానికి ఈ పడవలను ఉపయోగించామన్నారు. తనిఖీలకు వినియోగించిన సంబంధిత పడవలను ఇప్పటికే వెనక్కి తీసుకురావడం జరిగిందని వివేక్ తెలిపారు.



