వ్యాపారం

Ratan Tata: రతన్‌ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి పేరు

Ratan Tata: ప్రముఖ టాటా గ్రూప్ దిగ్గజం దివంగత రతన్ టాటా వీలునామా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన వీలునామాలో చేర్చిన పేరు టాటా ఆ కుటుంబాన్ని మాత్రమే కాదు.. యావత్త్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రతన్ టాటా తన ఆస్తుల్లో దాదాపు మూడింట ఒక వంతును మోహిని మోహన్ దత్తాకు అప్పగించారు.

జంషెడ్‌పూర్‌కు చెందిన వ్యవస్థాపకుడు మోహిని మోహన్ దత్తా.. స్టాలియన్‌కు సహ యజమాని కూడా. ఆ తరువాత టాటా సర్వీసెస్‌లో ఇది భాగమైంది. రతన్ టాటా విలీనానికి ముందు.. దత్తా స్టాలియన్‌లో 80శాతం వాటాను కలిగి ఉండగా, టాటా ఇండస్ట్రీస్ మిగిలిన 20శాతం వాటాను కలిగి ఉంది. 1960లలో టాటా తన టాటా స్టీల్‌లో పని చేసే సమయంలో ఆయన డీలర్స్ హాస్టల్‌లో దత్తాను కలిశాడు. అదే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

రతన్ టాటా తన వీలునామాలో దత్తా పేరు కనిపించే ముందు ఆయన గురించి ఎవరికి తెలియదు. కానీ ఆ వ్యవస్థాపకుడు ఎల్లప్పుడూ తన కుటుంబానికి దగ్గరగా ఉండేవాడని టాటా గ్రూప్ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. టాటాతో దాదాపు 6 దశాబ్దాల అనుబంధం ఉందని భావిస్తున్న దత్తా.. డిసెంబర్ 2024లో ముంబైలోనిలో జరిగిన రతన్ టాటా జయంతి వేడుకలకు ఆహ్వానితులుగా ఉన్నారని తెలుస్తోంది.

కాగా.. టాటా మరణించిన దాదాపు రెండు వారాల తర్వాత ఆయన వీలునామాను బహిరంగంగా ఉంచారు. ఈ వీలునామాలో ఆయన సోదరుడు, సోదరీమణులు, నమ్మకంగా పనిచేసే ఇంటి సిబ్బంది, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శాంతను నాయుడు వంటి అనేక మంది లబ్ధిదారులకు సంపదను కేటాయించారు.

తన పెంపుడు కుక్క టిటోకు అపరిమిత సంరక్షణ ఉండేలా టాటా అనేక నిబంధనలు కూడా చేశారు. టాటా సన్స్‌లోని వాటాలను రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్‌కు బదిలీ చేశారు. తన ఆస్తులలో అలీబాగ్‌లోని బీచ్ బంగ్లా, జుహులో రెండంతస్తుల ఇల్లు, 350 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టాటా సన్స్‌లో వాటా ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button