ఆంధ్ర ప్రదేశ్
Bhumana: చంద్రబాబు అబద్దాల మాటలపై పవన్ సమాధానం చెప్పాలి .. ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారు..?

Bhumana Karunakar Reddy: చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. చంద్రబాబు అబద్దాల మాటలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. అబద్దాలు చెప్పినందున ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏ గుడిమెట్లు కడుగుతారు..? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు.
నీతిఅయోగ్ పేరుతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలేనని మోసం చేశారు అని మండిపడ్డారు భూమన.. అధికారంలోకి వస్తే 15 వేలు పిల్లలకు, రైతు భరోసా, నిరుద్యోగ భృతి అంటూ హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్దాలు చేబుతున్నారు అని దుయ్యబట్టారు..అబద్దాలు బుద్దుడు ఈ చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.