News

Saif Ali Khan: సైఫ్‌ పై దాడి కేసులో కీలక మలుపు.. అసలైన నిందితుడు అరెస్టు

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు పేరు మహమ్మద్ సైఫుల్ ఇస్లామ్ ఆజాద్ అని ముంబై పోలీసులు వెల్లడించారు. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడని అనుమానం వ్యక్తం చేశా రు. దొంగతనం చేయాలన్న ఉద్దేశంతోనే నిందితుడు సైఫ్ ఇంట్లోకి చొరబడినట్లు వెల్లడించారు.

సైఫుల్ ఇస్లామ్ భారత్‌లోకి అక్రమంగా చొరబడినట్లు తెలిపిన పోలీసులు.. అతడి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవని చెప్పారు. నిందితుడు కొంతకాలంగా ముంబైలోనే ఉంటున్నట్లు.. తన పేరు విజయ్ దాస్‌గా చెప్పుకుంటున్నాడాని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button