News
సింహాద్రి అప్పన్న స్వామికి బంగారు కానుక

సింహాద్రి అప్పన్న స్వామికి భక్తుడు బంగారు కానుక సమర్పించారు. విశాఖపట్నంలోని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ CMR అధినేత మావూరి వెంకట రమణ.. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి ధ్వజస్తంభ పీఠానికి స్వర్ణ తాపడం చేయించి సమర్పించారు. సుమారు 509 గ్రాముల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ తాపడం విలువ కోటి 20 లక్షల రూపాయలుగా ఉంటుందాని ఆలయ అధికారులు తెలిపారు. గతంలోనూ ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేయించిన ఆయన.. తాజాగా అందించిన కానుకతో మొత్తం స్వర్ణ తాపడం విలువ సుమారు 4 కోట్ల రూపాయలకు చేరింది.



