ఆంధ్ర ప్రదేశ్
పంచాయతీ, మున్సిపల్ పోలింగ్‌పై జగన్ ఆరా

ఆంధ్రప్రదేశ్‌లో నేడు జరుగుతున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌తో పాటు నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల పోలింగ్ సరళిని జగన్ ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పోలింగ్ వివరాలపై పార్టీ నేతల నుంచి నివేదికలు తెప్పించుకోనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఓటింగ్ సరళి, ఎన్నికల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీయనున్నారు.



