తెలంగాణ
హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై మెట్రో రైల్, సిటీ బస్సుల్లో ప్రయాణానికి కామన్ పాస్ అందుబాటులోకి రానుంది. నేటి నుంచి ఈ సదుపాయం ప్రారంభం కానుంది. మెట్రో, ఆర్టీసీ సేవలను అనుసంధానించే కామన్ మొబిలిటీ పాస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, సులభమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.



