News
పట్టుచీరపై వాసవి అమ్మవారి దివ్య చరిత్ర

మగ్గంపై చీర నేయడం సాధారణమే కానీ చరిత్రను, ఆధ్యాత్మికతను, వందలాది పేర్లు, గోత్రనామాలను ఒకే పట్టుచీరపై ఆవిష్కరించడం మాత్రం అసాధారణం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య చరిత్రకు పట్టుదారంతో ప్రాణం పోశారు.
102 మంది ఋషుల పేర్లు, 102 గోత్రనామాలు, 25 చారిత్రక చిత్రాలను ఏకంగా 45 రోజులపాటు శ్రమించి సుమారు 7 మీటర్ల పొడవైన పట్టుచీరపై నేశారు. 2 గ్రాముల బంగారు జరీతో రూపొందించిన ఈ చీరలో భక్తి, చరిత్రతో పాటు చేనేత కళా నైపుణ్యం కనిపిస్తోంది.



