ఆంధ్ర ప్రదేశ్

YS Jagan: బాబు ష్యూరిటీ -మోసం గ్యారంటీ అనేది తేలిపోయింది

YS Jagan: చంద్రబాబు పాలనపై మాజీ సీఎం జగన్ ఫైరయ్యారు. చంద్రబాబు ఇచ్చిన “బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ” కాస్తా.. ఈ రెండేళ్లలోనే “మోసం గ్యారంటీ”గా తేలిపోయిందని జగన్ ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా ప్రజలపై బాదుడే బాదుడు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలును పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో రూపొందించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను వైఎస్ జగన్ ఇప్పుడే విడుదల చేశారు. ఈ మోసాలను ప్రజలందరికీ వివరించేందుకు జూన్ 4 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొని, పోటీ చేసే అభ్యర్థులకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు కొండంత అండగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button