ఆంధ్ర ప్రదేశ్
గోవుల రవాణాను అడ్డుకున్న కరాటే కళ్యాణి

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణాను కరాటే కళ్యాణి బృందం అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై మూడు బొలెరో వాహనాల్లో సుమారు 36 గోవులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గో సంరక్షణ సమితికి చెందిన కరాటే కళ్యాణి బృందం అప్రమత్తమైంది.
గోవుల తరలింపుపై ఆరా తీసి, మూడు బొలెరో వాహనాలతో పాటు గోవులను నక్కపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోవులను అక్రమంగా తరలించి సంపాదించే సొమ్ము ఎప్పటికీ నిలబడదని ఆందోళన వ్యక్తం చేశారు. గోవుల అక్రమ రవాణాపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



