ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ప్రభుత్వానికి చేరిన తిరుమల లడ్డూ నివేదిక

తిరుమల లడ్డూ నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తీరును కమిషన్ తప్పుపట్టింది. తిరుమల లడ్డూ కల్తీకి సింఘాల్దే బాధ్యతని తేల్చి చెప్పింది. లడ్డూ కల్తీని సింఘాల్ అడ్డుకోలేకపోయారని ఆక్షేపించింది. నెయ్యికి సంబంధించి రూల్స్‌ను సడలించినా బోర్డును సింఘాల్ ప్రశ్నించలేదని కమిషన్ పేర్కొంది. సింఘాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సింఘాల్‌తో పాటు పలువురు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సూచించింది.



