కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం వద్ద సఖి వన్ స్టాప్ సెంటర్ భవనం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో IDOC సమీక్ష సమావేశం నిర్వహించారు. దివ్యాంగులకు సహాయ ఉపకారణాల పంపిణీ, 64 రెట్రోఫీట్ మోటర్ స్కూటీలు,8 బ్యాటరీ వీల్ చైర్లు, 3 మొబైల్ బిజినెస్ ట్రై సైకిల్స్, 2 మినీ ట్రేడింగ్ ఆటోలు,2 హైబ్రిడ్ వీల్ చైర్లు, లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం ఇంద్రమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం లబ్ధిదారులతో విందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నడూ చేయలేని విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేస్తుందని ఇక ముందు అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని ఆరు గారంటీలలో ఐదు గ్యారంటీలు పూర్తి చేశామని మిగతా ఒక గ్యారెంటీ త్వరలో పూర్తిచేసే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.



