తెలంగాణ
నేడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభం

నేడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి. 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇచ్చారు. తాము పాలకులం కాదరి ప్రజల సేవకులమని రేవంత్ అన్నారు. 4 కోట్ల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.



