అంతర్జాతీయం
కుప్పకూలిన ఆర్మీ విమానం..110 మంది సైనికులు

కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పెరూ సరిహద్దులో ఆర్మీకి చెందిన సైనిక విమానం టేకాఫ్ సమయంలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదం సమయంలో విమానంలో మొత్తం 110 మంది సైనికులు ఉన్నారు.
ఇప్పటివరకు 90 మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. మరికొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమాన ప్రమాదానికి సాంకేతిక లోపమా.. లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా అన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.



