ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ CA. పి వి నారాయణ రావు ప్రతిష్టాత్మకICAI SRSB, న్యూఢిల్లి నందు కో-ఆప్టెడ్ మెంబర్‌గా నియమితులయ్యారు.

ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ CA. పి వి నారాయణ రావు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) యొక్క అతి ముఖ్యమైన కమిటీ *సస్టైనబిలిటీ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ బోర్డు (SRSB) నందు కో-ఆప్టెడ్ మెంబర్‌గా 2026-27 సంవత్సరానికి నియమితులయ్యారు.
CA పి. వి నారాయణ రావు తన గ్రాడ్యుయేషన్ B.Com నందు కాకతీయ యూనివర్సిటీ టాపర్ గా బంగారు పతకం సాధించి, తనకిష్టమైన చార్టర్డ్ అకౌంటెంట్ సాధించి విద్యార్ధి దశలోనే గుర్తింవు పొందినారు.
2015లో వరంగల్ ICAI బ్రాంచ్ చైర్మన్‌గా,2016 సంవత్సరానికి గాను ICAI సెంట్రల్ కౌన్సిల్ (న్యూఢిల్లీ) పబ్లిక్ రిలేషన్స్ కమిటీలో కో-ఆప్టెడ్ మెంబర్‌గా అత్యున్నత సేవలను అందించారు. ప్రస్తుతం తెలంగాణ & ఏపీ టాక్స్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఇరు రాష్ట్రాల్లో విశేషమైన సేవలను అందిస్తున్నారు.
ఇక, ప్రపంచ ప్రసిద్ధ సంస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ICAI ఫిబ్రవరి 2020లో ముఖ్యమైన SRSBను ఏర్పాటు చేసి, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDG) 2030 వైపుకు సంస్థలను మలిచి వాటి పురోగతిని వెల్లడించడానికి సమగ్ర, ప్రపంచ స్థాయిలో,సులభంగా అర్థమయ్యే స్టాండర్డులను రూపొందించడం లక్ష్యంగా పని చేస్తోంది. ఇట్టి బోర్డు ప్రముఖ సంస్థలు SEBI, MCA, NITI ఆయోగ్ లతో భాగస్వామ్యాలు ఏర్పరుచుకుంటూ నిరంతరం తులనాత్మకంగా వ్యవహరిస్తుంది.
ఈ బోర్డ్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలు నేటి ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ప్రకృతి వాతావరణ సమతుల్యతల ఆడిట్ నిర్వహించి తగు విధంగా రిపోర్ట్స్ సమర్పించి కంపెనీలకు సంస్థలకు దేశ రాజధాని నుండి వివిధ గ్రామ స్థాయిల వరకు వారిని ప్రోత్సహించడం కోసం ప్రణాళికలు.
ప్రకృతి పర్యావరణం పరిరక్షణ కోసం సామజిక బాధ్యతలతో పనిచేసే సంస్థలకు కంపెనీలకు అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం.
హరిత విప్లవం కోసమై ప్రపంచ స్థాయిలో అధ్యయనం కావించి ఉత్తమ పద్ధతులను దేశానికి అందించటం కంపెనీలను సంస్థలను తగిన కార్యాచరణ కోసమై మార్గదర్శనం చేయడం.
సోషల్ స్టాక్ ఎక్స్చేంజి పై అవగాహన కార్యక్రమం – CA లకు శిక్షణ కార్యక్రమాలు
మొత్తంగా హరిత విప్లవం ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసమై ప్రపంచ స్థాయి నాణ్యమైన పద్ధతులను అవగాహన మరియు CA లద్వారా భారత దేశాన్ని హరిత మయంగా న్యాయంగా బాధ్యతరహితంగా మార్చడం.
తన నియామకంపై సంతోషం వ్యక్తం చేస్తూ CA. పి వి నారాయణ రావు మాట్లాడుతూ, “ICAI నుంచి ఈ ప్రతిష్టాత్మక నియామకం పొందడం నాకు గొప్ప గౌరవం. సస్టైనబిలిటీ రిపోర్టింగ్ భారతదేశంలో పారదర్శక, బాధ్యతావంతమైన కార్పొరేట్ వ్యవస్థకు చాలా ముఖ్యం. ఈ బోర్డుకు నా అనుభవం & అంతర్దృష్టులతో సహకరిస్తానని ఆశభావం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఉన్న చార్టర్డ్ అకౌంటెట్స్ అభిమానం వారి సహకారంతో ఇతర బోర్డు సభ్యుల సమైక్య కృషితో ప్రణాళికా బద్ధంగా బోర్డు లక్ష్యాల మేరకు శాయ శక్తులా ప్రయత్నిస్తానని వారు అన్నారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్స్, మరియు వారి అభిమానులు వారిని అభినందించారు.



