News
ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పార్లమెంట్లో రేవంత్ రెడ్డి, వైసీపీ నేత రోజా కలుసుకున్నారు. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కొద్దిసేపు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఇతర నాయకులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు.



