ఏపీలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు

నేటి నుంచి ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది మొత్తం 6లక్షల 40 వేల 916 మంది పరీక్షలు రాయనుండగా.. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6లక్షల 22 వేల 074 మంది, ప్రైవేటు విద్యార్థులు 18 వేల 842 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల 415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 38 వేల 958 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొంటారు.
సమస్యాత్మకంగా గుర్తించిన 210 కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే 156 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. ఉదయం 8.45 గంటల్లోపే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే 10 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు.



