తెలంగాణలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు

తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడు గంటలపాటు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైన అధికారులు పరీక్షలకు అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం 2వేల676 సెంటర్లు ఏర్పాటు చేయగా 5లక్షల17 వేల 727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఆన్స ర్ బుక్‌లెట్‌లోని పేజీలను చింపితే విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదుచేస్తామని అధికారులు హెచ్చరించారు.
పది తరగతి పరీక్షల సందర్భంగా సెల్ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పరీక్ష కేంద్రాలను ‘నో సెల్‌ఫోన్’ జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్కాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. తనిఖీలకు వచ్చే అధికారులు సైతం సెల్ఫోన్లు తీసుకెళ్లరాదు. వీరు తమ సెల్ఫోన్లను ఆరుబయటే పెట్టాల్సి ఉంటుంది. ఎవరొచ్చినా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.



