జాతియం
రాహుల్‌కు బీజేపీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌కు బీజేపీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నోటీసులు దాఖలు చేశారు. బడ్జెట్‌పై చర్చలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులపై నిరాధారమైన ఆరోపణలు చేశారని నోటీసులు ఇచ్చారు. జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా రాహుల్‌ను నిషేధించాలని నోటీసులో బీజేపీ డిమాండ్ చేసింది.



