తెలంగాణ
నిజామాబాద్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.



