ఆంధ్ర ప్రదేశ్
Atchannaidu: కూటమి వచ్చాక పశువర్ధక శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టింది

Atchannaidu: ఎన్టీఆర్ జిల్లా నిడమానూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమాన్నిమంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ప్రారంభించారు. 12 రోజుల ఉచిత పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశు వైద్య చికిత్సలపై అవగాహన కల్పించనున్నారు.
ఏపీలో 60 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. పశుపోషణపై అనేక వేల మంది మహిళలు ఆధారపడి జీవిస్తనున్నారని అన్నారు. కూటమి వచ్చాక మళ్ళీ పశువర్ధక శాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టి, గతంలో ఆపేసిన పథకాలు తిరిగి నిర్వహిస్తున్నామన్నారు.



