Revanth Reddy: బీఆర్ఎస్ హయాంలో పేదలను ఇబ్బంది పెట్టారు

Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్ను తరిమికొట్టాలని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ హయాంలో పేదలను ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారని సీఎం ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను స్ఫూర్తిగా తీసుకున్నామని కాంగ్రెస్ పాలనలోనూ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. నేడు తమ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు. పేదలను ఇబ్బందులకు గురిచేసిన బీఆర్ఎస్ దిమ్మలు కూలగొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్రెడ్డి.



