తెలంగాణ
మేడారంలో జరగనున్న కేబినెట్ సమావేశం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశం అనంతరం.. మేడారంలో జరిగే పలు సంస్కృతి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా మేడారంలో బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వనదేవతల గద్దెలను పున:ప్రారంభించనున్నారు. ఇక సీఎం రేవంత్ పర్యటన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశానికి కావలసిన ఏర్పాట్లల్లో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.



